మంగళవారం, జులై 19, 2016

జై షిరిడీ నాథా..

గురుపౌర్ణమి సంధర్బంగా శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం చిత్రం కోసం రామకృష్ణ గారు గానం చేసిన ఈ దండకాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :
గానం : రామకృష్ణ

జై శ్రీ షిరిడీ నాథా.. సాయిదేవా.. ప్రభో..
శ్రీమన్ మహాదేవ దేవేశ షిరిడీశ సాయీశ
వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమాం పాహిమాం

బృందారకానేక సందోహ సంసేవ్య
సారుప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక
వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య
జేజియమాన ప్రతాపా చిత్ స్వరూపా
శశి సూర్య నేత్రాగ్ని తేజో స్వరూపా
విశ్వ విఖ్యాత రూపా సాయిదేవా పాహిమాం పాహిమాం

దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేధనా
భవ్య దివ్యఔషధ ప్రభావా
అచించ స్వరూపా ఆనంద సందాయకా
బహుజన్మ ప్రారభ్ద భాధావినిర్ముక్త సాద్గుణ్య
శ్రీ షిరిడీ బాబా ప్రభో పాహిమాం పాహిమాం..

దేవాధి దేవా సమస్తంబు
కల్పింప పాలింప దూలింపగా
పెక్కు దివ్యావతారంబులన్ బొందు
నీ పాద పంకేరుహధ్యాన  పారీణ
సుస్వాంతులయ్యపు భక్తాళి నిన్ బ్రోవవే
దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాసా
శ్రీ షిరిడీ బాబా నమస్తే నమస్తే నమః


2 comments:

వేణూగారూ..మీకు, మీ కుటుంబానికి ఆ సద్గురు కృపకలాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను..గురుపౌర్ణమి శుభాకాంక్షలు..

థాంక్స్ శాంతి గారు.. మీకు కుడా గురుపౌర్ణమి శుభాకాంక్షలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.