ఆదివారం, జులై 24, 2016

ఓ సారి నీ చెయ్యే తాకి...

కీరవాణి గారు స్వరపరచిన ఓ మాంచి రొమాంటిక్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు(2003)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : బాలు, చిత్ర

ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల
ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి
ఓ సారి ఏదేదో కావాల

పొగరే దిగనీ సొగసే కందనీ
అనుభూతి మనదైన వేళ
ఏహే.. హేహే..ఏహే.. 
ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల

ముద్దాడనా.. పెదవిని వలదని
నడుమును ముద్దాడుకో

వాటేయ్యనా.. ఎదురుగ వలదని
వెనకగ వాటేసుకో

చిన్నంగ నీ చెవిని స్పృశియించనా
నున్నంగా నీ వేళ్ళు నిమిరేయనా
ఆ పై లంఘించి విజృంభించి వివరించనా
నిదురా వద్దులే బెదురా లేదులే
చూడాలి శృంగార మేళ
 
ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల

వేధించనా.. సరసవు సగమున
విడిపడి వేధించుకో
వడ్డించనా.. అడగని క్షణమున
ఎగబడి వడ్డించుకో
నా పట్టు వస్త్రాలు వదిలెయ్యనా
నీ గట్టి ఒత్తిళ్ళు తరియించనా
అంతా అయిపోతే తెగ సిగ్గేసి తల వంచనా
ఏహే..లాలా..ఏహె..లాలా..
వ్రతమే చెడనీ ఫలమే అందనీ
చేరాలి స్వర్గాల మూల


ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపే నొక్కి
ఓ సారి ఇంకేదో చెయ్యాల
ఓ సారి నీ కాలే తొక్కి ఓ సారి నీ ఒళ్ళే రక్కి
ఓ సారి ఏదేదో కావాల 

 

2 comments:

జర్నీ లో వినే నంబర్స్ లో ఈ పాటా ఒకటండీ..

అవునా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.