సిరిమువ్వల సింహనాదం చిత్రం కోసం సిరివెన్నెల గారు రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సిరిమువ్వల సింహనాదం (1993)
సంగీతం : కె. వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శైలజ, బాలు
నేనెవరో అనామికనూ
ఈ కథలో అభిసారికను
నేనెవరో అనామికనూ
ఈ కథలో అభిసారికను
తలపులు తెలుపని కోరికను
ఏ తళుకులు తెలియని తారకను
నేనెవరో అనామికనూ
బదులు దొరకని పొడుపు కథనై ఎదురు చూస్తున్నా
పెదవి కదపని పేద యెదనై ఎదుటనే ఉన్నా
చెలిమి చినుకే తొలకరిస్తే చిగురు తొడిగేను
మనసు తెలిసి పలకరిస్తే మంచు కరిగేను
నేనెవరో అనామికనూ
దిశను తెలిపే కలికి కెరటం పిలుపు వింటున్నా
నిశిని చెరిపే పసిడి కిరణం వెలుగు కంటున్నా
గుండె లోతున గూటి కోసం కదిలి వస్తున్నా
గువ్వ జాడకు మువ్వ నవ్వులు కానుకిమ్మన్నా
నేనెవరో అనామికనూ
నీ కథలో అభిసారికను
తీరము దొరికిన కోరికను
నే పాదము తెరిచిన ద్వారకను
2 comments:
వండ్రఫుల్ మెలొడీ..బై ద వే, ఈ మూవీ రిలీజ్ అవ్వలేదనుకుంట కదండీ..
అవునండీ సినిమా రిలీజ్ అవలేదు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.