సోమవారం, జులై 04, 2016

ఏమిటో ఈ క్షణం...

ఒకమనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఇక్కడ ఎంబెడ్ చేసినది పాట ట్రైలర్ మాత్రమె పూర్తిపాట లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : ఒకమనసు (2016)
సంగితం : సునీల్ కశ్యప్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : హేమచంద్ర, ప్రణవి

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం


నా మనసున తొలకరి వానలు కురిసినవే
నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే
నా కనులలో రంగుల తారలు మెరిసినవే
నా అల్లరి ఆశలు అలలుగ ఉరికినవే
 
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం 
 
నేల మొత్తం వాన విల్లై వూగుతోందీ వింతగా
వీధులన్నీ వెన్నెలల్లే వెలిగిపోయే ఎంత బాగా
ఓ చల్లనిగాలే రోజూ నిలువెల్లా తాకినా 
హా ఈరోజే మరి నన్నూ గిలి గిలిగా గిల్లెనా
నీ జతే ఉండగా.. పూటకో పండగా.. గుండెకే వచ్చిపోదా.. 
నా ఎదురుగ జరిగే సంగతులేవైనా
అది నీ వలనే అని గమనిస్తూ ఉన్నా
నా లోపల జరిగే వేడుక ఏదైనా
ఇక జంటగా నీతో జరపాలంటున్నా

నేను అంటే నేను కాదే నీకు ఇంకో పేరులే
నువ్వు అంటే నువ్వు కాదే నాకు ఇంకో అర్థమేలే 
చూపులు కలిసిన తరుణం మహబాగా ఉందిలే
మనసుకి పట్టిన వ్యసనం అది నువ్వే అందిలే
గట్టిగా హత్తుకో.. ముద్దులే పెట్టుకో.. నన్నిలా కప్పుకోరా..

నేనున్నది అన్నది గురుతుకి రాకుండా
నా వెన్నెల వేకువ అన్నీ నువ్వైపో
ఈ లోకం కంటికి ఎదురే పడకుండా
నా లోకం మైకం అన్నీ నువ్వైపో

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం 

2 comments:

సెల్ఫిష్ నెస్ కి ప్రతిరూపం లాంటి అబ్బాయి..యెమోషన్స్, సున్నితత్వం తప్ప అంతగా ఆలోచన లేని అమ్మాయికీ మధ్యన జరిగే ప్రేమ కధ..రియాలిటీస్ నే మూవీస్ గా తీయాలంటే మధుర్ భండార్కార్ స్టైల్లో వెళ్ళచ్చుకదా..భావుకత, సున్నితత్వం, ప్రేమ అనే మేలి ముసుగులని వాడకుండా అనిపించిందండి..పాట బావున్నా..ఆ మూవీ చుశాక ఇది యెందుకో మనసుని టచ్ చేయలేదు..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.