శనివారం, జులై 09, 2016

నీవు లేని నేను లేను..

మంచిమనుషులు చిత్రం కోసం మహదేవన్ గారు స్వరపరచిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మంచి మనుషులు (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆహ..ఆహ..ఆహా..ఆహ...ఆ..ఆ..

నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు.. నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో..
ఈ జగమే లేదు..

నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు.. నువ్వే నేను
నువ్వూ నేను నేను నువ్వు లేనిచో..
ఈ జగమే లేదు..

తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ
పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..
తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ
పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..

తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ..
తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ...
తేనెకు మన ముద్దేలే తీపినిచ్చేదీ..తీపినిచ్చేదీ..

నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో..
ఈ జగమే లేదు..

నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ..ఈ
నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ..

సృష్టిలోని అణువు అణువులో..
వున్నామిద్దరమూ..ఊ..ఊ
జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ....

నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వూ నువ్వూ నేను లేనిచో..
ఈ జగమే లేదు..

కొండల్లే నువ్వున్నావు.. నాకు అండగా..ఆ..
మంచల్లే నువ్వున్నావూ.. నాకు నిండుగా..ఆ..ఆ..
కొండల్లే నువ్వున్నావు.. నాకు అండగా..ఆ..
మంచల్లే నువ్వున్నావూ.. నాకు నిండుగా..ఆ..ఆ..

ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..
నిన్నా..నేడు రేపే లేని..ప్రేమ జంటగా..ఆ..ఆ
ప్రేమ జంటగా..ఆ...

నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు...
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో..
ఈ జగమే లేదు..
అహ..అహ..హహా..హా.హా2 comments:

ముఖ్యం గా ఈ సీజన్ లో సన్నగా వర్షం పడుతున్నప్పుడు ఈ పాట వినడం మా ఫ్రెండ్సందరికీ చాలా ఇష్టమండీ..

మీ ఫ్రెండ్స్ హాబీ చాలా బాగుందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.