గురువారం, జులై 28, 2016

నాలో నేను లేనే లేను...

చక్రి స్వరసారధ్యంలో వంశీ గారి దర్శకత్వంలొ వచ్చిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పూర్తిపాట ఇక్కడ వినవచ్చు.


చిత్రం : అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు (2002)
సంగీతం : చక్రి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సాందీప్, కౌసల్య

నాలో నేను లేనే లేను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా


మొన్న నిన్న తెలియదే అసలు
మొన్న నిన్న తెలియదే అసలు
మదిలోన మొదలైన ఈ గుసగుసలు
ఏం తోచనీకుంది తీయని దిగులు
రమ్మని పిలిచే కోయిల స్వరమా
కమ్మని కలలే కోరిన వరమా
ఎందాక సాగాలి ఈ పయానాలు
ఏ చోట ఆగాలి నా పాదాలు 
 
నాలో నేను లేనే లేను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా

ఎన్నో విన్నా జంటల కధలు
ఎన్నో విన్నా జంటల కధలు
నను తాకనే లేదు ఆ మధురిమలు
కదిలించనే లేదు కలలు అలలు
గత జన్మలో తీరని రుణమా
నా జంటగా చేరిన ప్రేమా
నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో
నా శ్వాసతో నిన్ను పెంచిందేమో

నాలో నేను లేనే లేను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా 
 
 

4 comments:

వంశీ కే ఇలాంటి పాటని కన్సీవ్ చేయడం సాధ్యం..

సో ట్రూ శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

ఎస్ సిరివెన్నెల గారు _/\_ థాంక్స్ ఫర్ ద కామెంట్ రాజ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.