ఆదివారం, జులై 10, 2016

ప్రేమలో తీయదనం ఉన్నది...

అదిగో అల్లదిగో చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అదిగో అల్లదిగొ (1985)
సంగీతం : చంద్రశేఖర్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల(?)

ప్రేమలో తీయదనం ఉన్నది
అది ప్రేమించే వారికే తెలిసింది
సరె సరి
ప్రేమలో తీయదనం ఉన్నది
అది ప్రేమించే వారికే తెలిసింది
సరే సరి
తెలియనిది ఒకటుంది
త్యాగం ఎంత గొప్పదన్నది
తెలియనిది ఒకటుంది
త్యాగం ఎంత గొప్పదన్నది
సరే సరి
ప్రేమలో తీయదనం ఉన్నది
అది ప్రేమించే వారికే తెలిసింది
సరే సరి

ఇన్నాళ్ళు ఈ సిగ్గు ఏడ దాగి ఉన్నది
పానకాన పుడకలాగా ఇప్పుడొచ్చి పడ్డది
ఇన్నాళ్ళు ఈ సిగ్గు ఏడ దాగి ఉన్నది
పానకాన పుడకలాగా ఇప్పుడొచ్చి పడ్డది
సందెవేళ కురులలోన మొగ్గలా ఉన్నది
తెల్లవారి కౌగిలిలో పువ్వులా పూస్తుంది

అసలు మీద లేని మోజు వడ్డీపై ఉన్నది
కొడుకు కన్న మనవడే గుండెపై తన్నేది
లాలీ లాలి జో లాలి లొలొ హాయ్
హాయి హాయి జో లాలి లొలొ హాయ్
అసలు మీద లేని మోజు వడ్డీపై ఉన్నది
కొడుకు కన్న మనవడే గుండెపై తన్నేది
పొద్దువాలి పోతుంటే ముద్దు పెరిగి పోతుంది
ముగ్గుబుట్ట సరసానా సిగ్గింకా ఉన్నది

ఒహ్హొహ్హొ..ఓఓ..అహ్హాహ్హా..హాఅ....
చేయి చేయిగా హాయి హాయిగా
చేయి చేయిగా దాంపత్యం
హాయి హాయిగా సంసారం
చేయి చేయిగా దాంపత్యం
హాయి హాయిగా సంసారం
చేసినాములే చూసినాములే
ఒహోహొహొహో..హో.హో
అహహహ్హహహ్హ..హహ
ఆనందం ఆనందం
ఆనందమె జీవిత మకరందం.
ఆనందం ఆనందం
ఒహోహొహొహో..హో.హో
అహహహ్హహహ్హ..హహ

2 comments:

అబ్బా..చాలా రోజులైందండి ఈ పాట విని..నైస్ వన్..థాంక్యూ..

నేను కూడా విని చాల్రోజులైందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.