శుక్రవారం, జులై 22, 2016

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో...

గబ్బర్ సింగ్ చిత్రంలోని ఒక హుషారైన గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గబ్బర్ సింగ్ (2012)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : కార్తీక్, శ్వేతా మోహన్

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
తొలి తొలి చూపుల మాయా
తొలకరిలో తడిసిన హాయా
తనువున తకదిమి చూశా ఓ ప్రియా
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో

నా గుండెలోన మ్యాండొలిన్ మోగుతున్నదే
ఒళ్ళు తస్సదియ్య స్ప్రింగు లాగ ఊగుతున్నదే
ఓ.. సనమ్ నాలో సగం
పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్ధమేదొ జరుగుతున్నదే
నీ.. వశం నేనే కసమ్
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళి మళ్ళి చూసి
వెల్లకిల్ల పడ్డ ఈడు ఈల వేసే
కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే
 
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే

రెండు కళ్ళలోన కార్నివల్ జరుగుతున్నదే
వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే
ఈ.. సుఖం అదో.. రకం
బుగ్గ పోస్టుకార్డు ముద్దు ముద్దరెయ్యమన్నదే
లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే
ఈ.. క్షణం నిరీక్షణం
హే.. చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినావే

చుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే
లబ్ డబ్ మాని గుండె ఢంఢనాక ఆడే.. హో..
 
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో హో..

 

2 comments:

భలే పాటండీ..గాలికి సన్నగా ఊగే లతలా పాటంతా స్వింగ్ ఔతూ ఉంటుంది..

భలే వర్ణించారు శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.