మంగళవారం, జనవరి 31, 2017

గాలే నా వాకిటికొచ్చె..

రిథమ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. 

చిత్రం : రిథం (2000)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, కవితాకృష్ణమూర్తి

గాలే నా వాకిటికొచ్చె.. మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ.ఆ

నీవూ నిన్నెక్కడ వున్నావ్.. గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో వున్నావ్ అమ్మీ అవునా !

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ..
ఇల వున్న వరకూ నెలవంక వరకూ.. గుండెలోకి వీచు

ఇల వున్న వరకూ నెలవంక వరకూ.. 
గుండెలోకి వీచు ఊ ఊ ఊ

గాలే నా వాకిటికొచ్చె..మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

నీవూ నిన్నెక్కడ వున్నావ్.. గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో వున్నావ్.. అవునూ..ఊ అవునా..ఆ..ఆ

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ..
ఇల వున్న వరకూ నెలవంక వరకూ.. గుండెలోకి వీచు

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె 
ఎంకి పాట పాడూ..ఊ..ఊ..ఊ

గాలే నా వాకిటికొచ్చె..మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

ఆషాడ మాసం వచ్చి.. వానొస్తే నీవే దిక్కు
నీ వోణీ గొడుగే పడతావా..ఆ..ఆ..ఆ..ఆ

అమ్మో నాకొకటే మైకం.. అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా..ఆ..ఆ..ఆ..ఆ

నీ చిరు సిగ్గుల వడి తెలిసే..
నేనప్పుడు మదిలో వొదిగితే
నీ నెమ్మదిలో నా వునికే కనిపెడతా..ఆ.వా..ఆ..ఆ

పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి

భూమికి పైన మనిషున్న వరకూ కరగదు వలపు

గాలే నా వాకిటికొచ్చె..మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

గాలే నా వాకిటికొచ్చె..మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

చిరకాలం చిప్పల్లోనా వన్నెలు చిలికే ముత్యం వలెనే
నా వయసే తొణికసలాడినదే..ఏ..ఏ..ఏ..
తెరచాటు నీ పరువాల తెర తీసే శోధనలో
ఎదనిండా మదనం జరిగినదే..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏఏ

నే నరవిచ్చిన పువ్వైతే.. నులి వెచ్చని తావైనావు
ఈ పడుచమ్మను పసిమొగ్గను చేస్తావా...ఆ..ఆ..ఆ..ఆ

కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే సరియా సఖియా..
కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే సరియా సఖియా..

చిన్న పిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా..

గాలే నా వాకిటికొచ్చె.. మెల్లంగా...
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ..
ఇల వున్న వరకూ నెలవంక వరకూ.. గుండెలోకి వీచు

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ.. ఊ ఊ ఊ
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ..

1 comments:

manchi song post chesinanduku chala thanks venu garu

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.