ఆదివారం, జనవరి 08, 2017

హే మాధవా...

ఈ రోజు వైకుంఠ ఏకాదశి సంధర్బంగా మిత్రులందరికి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన ఆ శ్రీ మహా విష్ణువుకి నమస్కరిస్తూ ఈ చక్కని పాటలు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియోస్ లోడ్ అవని వాళ్ళు ఇక్కడ మరియూ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ సత్యన్నారాయణ మహత్యం (1964)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం :
గానం : ఘంటసాల

హే మాధవా.. మధుసూదనా
కనజాలవా.. ఆఅ..ఆ..
జగన్నాయకా అభయదాయక
జాలము సేయక రావా
హే మురారి కరుణాకర శౌరీ
నా మొరలే వినలేవా
జగన్నాయకా అభయదాయక
జాలము సేయక రావా
హే మురారి కరుణాకర శౌరీ
నా మొరలే వినలేవా

నిన్ను సేవించు నన్ను శోధింప న్యాయమా నీకు దేవా
సాకారా నిరాకారా ఆశ్రిత పాలిత మందారా
సాకారా నిరాకారా ఆశ్రిత పాలిత మందారా
పాల ముంచినా నీట ముంచినా భారము నీదే దేవా
శ్రీనివాస వైకుంఠ నివాసా దేవా నా గతి నీవే 
పాల ముంచినా నీట ముంచినా భారము నీదే దేవా
శ్రీనివాస వైకుంఠ నివాసా దేవా నా గతి నీవే

జగము తరియింప కరుణ కురిపించి కావవా దేవ దేవా
సాకారా నిరాకారా ఆశ్రిత పాలిత మందారా
సాకారా నిరాకారా ఆశ్రిత పాలిత మందారా
పాలిత మందారా...

హేమాధవా కరుణించవా..
హేమాధవా కరుణించవా..
హేమాధవా కరుణించవా..
హేమాధవా హేమాధవా
హేమాధవా హేమాధవా 

హే మాధవా.. మధుసూదనా
కనజాలవా.. ఆఅ..ఆ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : శ్రీ సత్యన్నారాయణ మహత్యం (1964)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం :
గానం : ఘంటసాల 

శ్రీ క్షీరవారాసి కన్యా పతారంభ రమ్య మందస్మితా 
శంఖ చక్రాంకితా కౌస్తుభాలంకృతా 
దివ్య మందార దామోదరా 
నీలధారాధరాకారా విజ్ఞాన సారా 
నిరాకారా.. సాకారా.. ప్రేమావతారా 

ముకుందా సదానందా గోవిందా
సంరక్షితానేక యోగీశ బృందా 
దయాపాంగా సంతోషితానంత 
దాసాంతరంగా ఆఆ ఆఅ

భవదీయ సౌందర్య కారుణ్యలీలా విలాసంబు 
బృందారకాధీశులే చాటలేరన్నా నేనెంత వాడన్ ప్రభో 
దాటగారాని మాయా ప్రవాహంబులో చిక్కి 
వ్యామోహ తాపంబులన్ సొక్కి సోషించి ఘోషించు 
నీ దాసునిన్ చూచి వాత్సల్యమేపారగా బ్రోచి 
సాలోక్యమిప్పించుమా నీదు సాయుజ్యముం గూర్చుమా 
స్వామీ శ్రీ సత్యనారాయాణ.. నమస్తే నమహ.. 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.