కనుమ సంధర్బంగా మిత్రులకు శుభాకాంక్షలు. రైతుల పండగ అయిన ఈ సంక్రాంతి నుండైనా రైతు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వారి కష్టాలను గురించి రామజోగయ్య గారు హృద్యంగా రాసిన ఒక మంచి పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చూ.
చిత్రం : ఖైదీ నంబర్ 150 (2017)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్
నీరు.. నీరు..నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ
అన్నదాత గోడు నింగినంటె నేడు
ఆలకించు వారు ఎవ్వరూ....
నీరు.. నీరు..నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గొంతు ఎండిపోయే పేగు మండిపోయే
గంగతల్లి జాడ లేదనీ
నీటి పైన ఆశే నీరుగారి పోయే
రాత మారు దారి లేదనీ
దాహం ఆరుతుందా
పైరు పండుతుందా
ధారాలైన కంటి నీటితో
నీరు.. నీరు..నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ
నేల తల్లి నేడు అంగిలారిపోయే
మూగబోయే రైతు నాగలీ
ఆయువంతా చూడూ ఆర్తనాదమాయే
గొంతు కోసుకుంది ఆకలీ..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.