బుధవారం, జనవరి 11, 2017

కదలిరా మాధవా...

కాస్త ఆలస్యంగా మధుర గాయకులు కె.జె.ఏసుదాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం చిత్రం కోసం వారు గానం చేసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : గోపి
గానం : కె.జె.ఏసుదాస్

కదలిరా మాధవా జాణతనమేలరా
మణిమకుటం శిఖిపింఛం
చిరునగవు ననుపిలిచే
మాధవా... కేశవా.. శ్రీధరా.. ఓం...

వేడితిని దేవ దేవ ఆ పసిడి పాదమే
పాడితిని వాసుదేవ వేద సంగీతమే
నాదుశ్వాస ఆగనీ వేణుగానం సాగనీ
పాద పీఠం చేరనీ
వేడితిని దేవ దేవ ఆ పసిడి పాదమే
స్వామి నాకేదిరా వేణుగానామృతం
తండ్రి నను చేర్చుకో నీదు బృందావనం
భ్రాంతివీ శాంతివీ మమ్ము నడిపే కాంతివి
ఆత్మ జ్ఞానం అనుగ్రహించు

వేడితిని దేవ దేవ ఆ పసిడి పాదమే

స్వామీ శరణం స్వామీ శరణం 
స్వామీ శరణం స్వామీ శరణం
రాఘవేంద్రా శ్రీ రాఘవేంద్రా
స్వామీ శరణం స్వామీ శరణం 

జ్ఞాన దీపాన్ని చేర వరమీయవా
నేను పూజించు పాదం దరిచేర్చవా
భక్త రేణువును స్వామి ఒడి చేరనీ
తీరమును చేరు దారి కనిపించని
నా గోడు ఆలించు దేవా
దాసుడ్ని దయచూడ రావా
ఏనాటి పాపం చేసేవు దూరం
ఈవేళ కరుణించు దరిచేరు భాగ్యం


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.