శనివారం, జనవరి 28, 2017

మానసవీణ మౌనస్వరాన...

హృదయాంజలి చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : హృదయాంజలి (1993)
సంగీతం : రెహ్మాన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర

మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
పచ్చదనాల పానుపుపైన అమ్మైనేలా జోకొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన అమ్మైనలా జోకొడుతుంటే

మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

పున్నమినదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరిమజిలి వేకువ వెనువెంట నేలకు తరలి
కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి

మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
 
వాగుల నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎప్పుడు నా సొంతం
వాగుల నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎప్పుడు నా సొంతం

ఊహకు నీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకేలవేసి కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకువెళ్ళి
పేద గరికపూలకు ఇస్తా నా హృదయాంజలి

మానసవీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
మానసవీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం
పచ్చదనాల పానుపుపైన అమ్మైనేల జోకొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన అమ్మైనేల జోకొడుతుంటే
 
మానసవీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం

వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం
వాగులా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడు నా సొంతం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హ హ ఆ ఆ హ ఆ ఆ

2 comments:

manchi song venu garu a r rahman ilanti songs eppudu compose cheyyadam ledhu nenu post cheyamani adigindi ilanti songse venugaru rahman songs manchivi chala vunnayi kani chalamandiki teliyadu andukani post cheyyamannanu vanitha movie lo sirimalle song post cheyyandi

అవునండీ తను మొదట్లో చేసిన కంపొజిషన్స్ బాగుండేవి.. థాంక్స్ అజ్ఞాత గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.