వనిత చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : వనిత (1994)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : గురుచరణ్
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర
సిరిమల్లె మొగ్గమీద చిట్టి జల్లు
కొట్టెనమ్మ గాలి వాన గాలి
ఆ వాన మత్తులోన రెపరెపలాడి
పోయానమ్మా జారి పైట జారి
వెంటాడి పడ్డ చుక్క జల్లంటు ముద్దు చేసి
సింగారి సిగ్గు గిల్లి చీరంత ముద్ద చేసె
సిరిమల్లె మొగ్గమీద చిట్టి జల్లు
కొట్టెనమ్మ గాలి వాన గాలి
ఆ వాన మత్తులోన రెపరెపలాడి
పోయానమ్మా జారి మనసు జారి
వెంటాడి పడ్డ చుక్క జల్లంటు ముద్దు చేసి
సింగారి సిగ్గు గిల్లి చీరంత ముద్ద చేసె
సిరిమల్లె మొగ్గమీద చిట్టి జల్లు
కొట్టెనమ్మ గాలి వాన గాలి
కోకంచు మీదుండి జారేటి చుక్కల్లో
నీ వేడి నా ఈడు తాకిందిలే
ఉయ్యాల ఊగించి నాలోన ఆ వేడి
కాపాడి ఓ పాట పాడిందిలే
వాన చుక్క ఏమి తపం చేసిందని
మనసైన బంతాట ఆడిందిలే
మత్తైన కన్నెతనం చల్లారదూ
మనువైతె బంతాటె తెల్లారులూ
సిరిమల్లె మొగ్గమీద చిట్టి జల్లు
కొట్టెనమ్మ గాలి వాన గాలి
ఆ వాన మత్తులోన రెపరెపలాడి
పోయానమ్మా జారి పైట జారి
వెంటాడి పడ్డ చుక్క జల్లంటు ముద్దు చేసి
సింగారి సిగ్గు గిల్లి చీరంత ముద్ద చేసె
సిరిమల్లె మొగ్గమీద చిట్టి జల్లు
కొట్టెనమ్మ గాలి వాన గాలి
ఆ వాన మత్తులోన రెపరెపలాడి
పోయానమ్మా జారి మనసు జారి
నీవంటు నేనంటు ఇక రెండు లేవంటు
మనకంటు ఒక రోజు వచ్చిందిలే
రేయంటు పగలంటు ఇకపైన లేవంటు
నీ ఈడు ఒక ఊపు ఇచ్చిందిలే
కళ్ళతోటి మంతరిస్తే కైపైనది
కుచ్చుకున్న ముల్లైన మల్లైనది
వేడి ఎక్కి పిల్ల ఒళ్ళు విల్లైనదీ
వానమ్మ ఒళ్ళోన పెళ్ళైనదీ
సిరిమల్లె మొగ్గమీద చిట్టి జల్లు
కొట్టెనమ్మ గాలి వాన గాలి
ఆ వాన మత్తులోన రెపరెపలాడి
పోయానమ్మా జారి పైట జారి
వెంటాడి పడ్డ చుక్క జల్లంటు ముద్దు చేసి
సింగారి సిగ్గు గిల్లి చీరంత ముద్ద చేసె
4 comments:
chala thanks venu garu
a r rahman songskadile nadhila song from rhythm and allukunnadi jallumannadi from premante pranamistha and edapai jarina song from hrudayanjali songs post cheyandi sir ippudante ippudu kadhu meeku veelu kudinappudu please venugaru nenadigina vanitha songs post chesinanduku chala thanks
Good post sir
తెలుగు డబ్బింగ్ సినిమాల సునామీ!
Please Visit Blog for All Telugu Dubbed Movies
శ్రద్దగా ఫాలో అవుతూ ప్రోత్సహిస్తున్నందుకు.. థాంక్స్ అజ్ఞాత గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.