గురువారం, జనవరి 12, 2017

మదిలో వీణలు మ్రోగే...

ఆత్మీయులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరధి
గానం : సుశీల

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను
అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

రాధలోని అనురాగమంతా మాధవునిదేలే
రాధలోని అనురాగమంతా మాధవునిదేలే
వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.