శుక్రవారం, జనవరి 13, 2017

శతమానం భవతి...

మిత్రులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ధనుర్మాసం చివరి రోజైన ఈ రోజు గోదాకళ్యాణం సందర్భంగా బాపు గారి రాధాగోపాళం సినిమా కోసం ఆలుమగలు ఎలా ఉండాలో అందంగా చెప్పిన వేటూరి వారి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాధాగోపాళం (2005)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : బాలు, చిత్ర

శతమానం భవతి శతమానం భవతి 
శతమానం భవతి
శతమానం భవతి నీకు శతమానం భవతి 
 
ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతి
శతమానం భవతి నీకు శతమానం భవతి
తనువులు రెండు తామొకటైన సీతారాములకి
శతమానం భవతి నీకు శతమానం భవతి
 
ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతి
శతమానం భవతి నీకు శతమానం భవతి
తనువులు రెండు తామొకటైన సీతారాములకి
శతమానం భవతి నీకు శతమానం భవతి

వేదం నాదంలా వెలుగూ దీపంలా
హారం దారంలా క్షీరం నీరంలా
మాటా అర్ధం రాగం భావం తూర్పు ఉదయంలా
పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా
ఆలుమగలు మొగుడు పెళ్ళాం భార్యా భర్తలకీ
శతమానం భవతి నీకు శతమానం భవతి

శతమానం భవతి శతమానం భవతి 
శతమానం భవతి శతమానం భవతి

తాళి కట్టే వేళ్ళు తడిమేటి వేళ
చాటు చూపులు సోకి సరసమాడే వేళ
పందెమేసే లేత అందాల బాల
తళుకులన్నీ తలంబ్రాలు పొసే వేళ
చేయి చేయి పట్టి చెంగు చెంగు కట్టి
ఏడు అడుగుల బాట నడిచేటి వేళ
తొలి కౌగిలింతలో పులకింత వేళ
ఆ వేళ ఈ వేళ ఆనంద వేళ
నూరేళ్ళకి నిత్య కల్యాణ హేల

శతమానం భవతి నీకు శతమానం భవతి
శతమానం భవతి నీకు శతమానం భవతి


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.