ఆదివారం, జనవరి 29, 2017

స్నేహితుడా స్నేహితుడా...

సఖి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : సాధనా సర్గమ్, శ్రీనివాస్

నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపొతానో ఇలా డోలలూగేనో
ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో 

నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో

కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే


స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా!
చిన్నచిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా!
ఇదే సకలం సర్వం, ఇదే వలపూ గెలుపు,
శ్వాస తుదివరకూ వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణబంధం

 
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా!
  
చిన్నచిన్న హద్దు మీర వచ్చునోయ్
ఈ జీవితాన పులకింత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా
నేను నిద్రపోతే లేతగోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి, ఆవువెన్న పూసి 
సేవలు శాయవలెగా
ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం!

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా!
చిన్నచిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా!

 
నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపొతానో ఇలా డోలలూగేనో
ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో 
నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో

కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే


శాంతించాలి పగలేంటి పనికే
 
శాంతించాలి పగలేంటి పనికే
 నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలేపొద్దు వలపే
ఉల్లం చక్కా ఆరబోసె వయసే
నీటి చెమ్మచెక్కలైనా నాకు వరసే
ఉప్పుమూటే అమ్మైనా
ఉన్నట్టుండి ఎత్తేస్తా, ఎత్తేసి విసిరేస్తా 
కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలాక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా!
చిన్నచిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా!
ఇదే సకలం సర్వం, ఇదే వలపూ గెలుపు,
శ్వాస తుదివరకూ వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణబంధం

 
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా!
చిన్నచిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా!

1 comments:

one of the rahman best song and amazing voice by sadhanaji and srinivas ji

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.