సోమవారం, జనవరి 16, 2017

ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్...

ఊపిరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఊపిరి (2016)
సంగీతం : గోపీసుందర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్ 

ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్
ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్

ఇది కాదే అనుకుంటూ
వదిలేస్తే వేరే అవకాశం రాదే
ఇది ఇంతే అనుకుంటే
వందేళ్ళు నీదే జీవించే వీలుందే

ఊ.... ఊ.... ఊ.... ఊ....

ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్
ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్

ఏం ఏం లేదని మనం చూడాలి గాని
ఊపిరి లేదా ఊహలు లేవా
నీకోసం నువ్వే లేవా
చీకటికి రంగులేసే కలలెన్నో నీ తోడై వస్తుండగా
ఒంటరిగా లైఫ్ ఉందీ...
ఆశకు కూడా ఆశని కలిగించేయి
ఆయువు అనేదుండే వరకు
ఇంకేదో లేదని అనకు
ఒక్కో క్షణము ఈ బ్రతుకు కొత్తదే నీకు

ఊ.... ఊ.... ఊ.... ఊ....

ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్
ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్
ఇది కాదే అనుకుంటూ
వదిలేస్తే వేరే అవకాశం రాదే
ఇది ఇంతే అనుకుంటే
వందేళ్ళు నీదే జీవించే వీలుందే

ఊ.... ఊ.... ఊ.... ఊ....

 

2 comments:

Sahityam: Sirivennela
Madhan Karky Tamil version Lyricist

థాంక్సండీ.. అప్డేట్ చేశాను..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.