మంగళవారం, జనవరి 24, 2017

మెరిసే మెరిసే...

పెళ్ళి చూపులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళిచూపులు (2016)
సంగీతం : వివేక్ సాగర్
సాహిత్యం : శ్రేష్ట
గానం : హరిచరణ్, ప్రణవి

మెరిసే మెరిసే మనసే మురిసే నీలా
చెలి నీ వలనే
చిరు చిరు ఆశలు విరిసేగా

కడలే ఎదలో మునకేసేనా ఆఆ..
తొలి తొలి గా ఆఆ.. అః ఆ..
ఆ.. అరె అరె భువి తిరిగెనులే
తిరిగి తన దిశ మార్చి
ఆఅ అలరారే అల ఏగిసే
తానే తననే చేరీ
హృదయం లోలోనా పరిచే
ఎన్నో వెలుతురులే
మిణుగురులై ముసిరే ఎద నిమిరే


కడలే ఎదలో మునకేసెనా
చిగురులు తొడిగే లతలే 
అన్నిసీతాకోక లాయె
తళతళాలాడే చుక్కలనే తాకే
నీలాకాశం చుట్టురూ తిరిగేస్తూ
ఎంతాశ్చర్యం జాబిలికే 
నడకలు నేర్పిoచే

ఆ.. అరె అరె భువి తిరిగెనులే
తిరిగీ తన దిశ మార్చి

ఆఅ అలరారే అల ఏగిసే
తానే తననే చేరి

కసురుతూ కదిలే కాలం
ఏమైపోయినట్టు
కోసరి కోసరి పలకరించు
జల్లులిలా ఇన్నాళ్ళేమైనట్టూ
గగనం నయనం తెరువంగా
మురిసే భువనమిలా
ఒకటై నడిచే అడుగులిక
నిలవాలి కలకాలం

  
మెరిసే మెరిసే మనసే మురిసే నీలా
చెలి నీ వలనే చిరు చిరు ఆశలు విరిసేగా
తొలి తొలి గా ఆఆ.. అః ఆ..
ఆ.. అరె అరె భువి తిరిగెనులే
తిరిగీ తన దిశ మార్చి
ఆఅ అలరారే అల ఏగిసే

తానే తననే చేరి
హృదయం హృదయం 
లోలోనా లోలోనా పరిచే
ఎన్నో వెలుతురులే
మిణుగురులై ముసిరే ఎద నిమిరె


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.