ఆదివారం, జనవరి 22, 2017

డోలాయాంచల...

కలియుగదైవం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కలియుగదైవం (1983)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

డోలాయాంచల డోలాయాం హరె డోలాయాం 
డోలాయాంచల డోలాయాం హరి డోలాయాం 
లీలా మానుష శీలా నా మురిపాలా గోపాల గోవిందా 
డోలాయాంచల డోలాయాం హరె డోలాయాం 

రాతిని నాతిని చేసిన ఆ రఘురాముడు నీవేగా 
ఈ బొమ్మను అమ్మను చేసిన పసిపాపడు నీవేగా 
వకుళా మందిర దీపా వర్జిత పాపా పాలయమాం 
హరిహర గోపాల నటజన పరిపాల ఊగర ఉయ్యాలా 

డోలాయాంచల డోలాయాం హరె డోలాయాం 

తల్లీ తండ్రీ గురువూ దైవం బిడ్డవు నీవేగా 
ఇహమూ పరమూ జన్మకు వరమూ ఇలలో నీవేగా 
తిరుమల తిరుపతి వాసా హే జగదీశా పాలయమాం
కలిజన కళ్యాణ కలజన కల్లోల ఊగర ఉయ్యాలా 

డోలాయాంచల డోలాయాం హరె డోలాయాం 
లీలా మానుష శీలా నా మురిపాలా గోపాల గోవిందా 
డోలాయాంచల డోలాయాం హరె డోలాయాం

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.