శనివారం, జనవరి 21, 2017

మెల్లగా తెల్లారిందోయ్ అలా...

శతమానంభవతి చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరిక్స్ వీడియో ఇక్కడ.


చిత్రం: శతమానం భవతి
గానం: అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు
సంగీతం: మిక్కీ జె.మేయర్‌
రచన: శ్రీమణి

మెల్లగా తెల్లారిందోయ్ అలా
వెలుతురే తెచ్చేసిందోయ్ ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా

చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో
చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించి
అందించు హృదయంలా

చలిమంటలు ఆరేలా
గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా..ఆఆ..
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా..ఆఆ..

పొలమారే పొలమంతా
ఎన్నాళ్లో నువ్వు తలచీ
కళమారే ఊరంతా
ఎన్నేళ్లో నువ్వు విడచి

మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన
పసి తనమే గుర్తొస్తుందా...

ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయనా..

నువ్వూగిన ఉయ్యాలా..
ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడకా..ఆఆ..
నువ్వాడిన దొంగాట
బెంగల్లే మిగలాలా
తన్నెవరూ వెతికే వీల్లేకా..ఆఅ..

కన్నులకే తియ్యదనం
రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయెళ్లే

పూల చెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే
అందం మాటాడే భాష

పలకరింపే పులకరింపై
పిలుపునిస్తే పరవశించడమే
మనసుకి తెలిసిన భాష

మమతలు పంచే ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరూ..ఊఊ

ప్రేమలు పుట్టిన ఊరు
అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ..ఊఊ

 

4 comments:

venu garu naku vanitha movie lo 2 songs kavali ani cheppanu kandi please post cheyandi

పంచదారలో తేనె నంజుకుని తిన్నట్టుగా అతి తీపిగా వెగటుగా ఉంది.

సార్!
ఇదివరకు ఒకసారీ అడిగితే ఇచ్చారు.పాత కంప్యూతరుతో పాతే పోయింది గాబట్టి మరోసారి అడుగుతున్నాను.కొత్త జీవితాలు సినిమాలోని పాత "తంతననం తంతననం తంతనన తాళంలో మృదునాదంలో" పాట లింకు ఇవ్వగలరా?
hari.S.babu

మొదటి అజ్ఞాత గారు త్వరలో పోస్ట్ చేస్తానండీ.. సారీ ఫర్ ద డిలే..

రెండవ అజ్ఞాత గారు నా ఎన్నారై మిత్రులు కొందరు ఈ సినిమా గురించి కూడా అదే ఆన్నారండీ..

హరిబాబు గారు ఇదిగోండి మీరడిగిన లింక్.
http://sarigamalagalagalalu.blogspot.in/2014/10/blog-post_9.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.