వనిత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసినది తమిళ్ వీడియో, అది లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. తెలుగు పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : వనిత (1994)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : నారాయణ వర్మ
గానం : ఉన్ని మీనన్, సుజాత
పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా
పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా
వయసేమో తుళ్ళీ విరహాలు జల్లీ
ఊరించే కన్నె కిష్ణమ్మా ఆఆ..
దారేమో కాచీ సిగ్గు తెరతీసి
ముద్దాడ వచ్చాడయ్యా
కన్నెదొంగ కృష్ణయ్యా
పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా
పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా
పొరుగింటి మీనా మురిపాల మైనా
తలపులు రేగెను సాగెను ఆశల పల్లకిలో
నా మనసే దోచి వయసే శృతి చేసి
వలపించి గిలిగిచ్చే ఈ దోబూచేల దొంగాడల్లే
వెంటాడీ జతకూడీ దాగోనేలా గోరింకల్లే
అలకిక ఏలనే చాలిక కోరిక తీరునులే..ఏఏ..
పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా
పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా
వయసేమో తుళ్ళీ విరహాలు జల్లీ
ఊరించే కన్నె కిష్ణమ్మా ఆఆ..
దారేమో కాచీ సిగ్గు తెరతీసి
ముద్దాడ వచ్చాడయ్యా
కన్నెదొంగ కృష్ణయ్యా
పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా
నీ చెంత ఉంటే ఉప్పొంగులేగా
కోయిల కూసెను ఊహలు ఊసులు పల్లవిగా
అలివేణి హొయలు అందాల సిరులు
ఎగిరిందే శీతాకోక చిలుకల్లె ఎదగిల్లి
పో నెలవెంక ఏల ఎంకి కూలి కిందే కథలల్లీ
చనువును పెంచకు మగువకు
మనువే భాగ్యముగా ..ఆఅ..
పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా
పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా
వయసేమో తుళ్ళీ విరహాలు జల్లీ
ఊరించే కన్నె కిష్ణమ్మా ఆఆ..
దారేమో కాచీ సిగ్గు తెరతీసి
ముద్దాడ వచ్చాడయ్యా
కన్నెదొంగ కృష్ణయ్యా
పూదోట పూచిందంటా
పుత్తడిబొమ్మ వలచిందంట
కనువిందు అందమంత విందులంటా
పూదోటా పూచిందంటా
పూజకు పువ్వై వేచిందంటా
వయ్యారి ప్రాయమంతా కానుకంటా
2 comments:
chala thanks venugaru ee songs post chesinanduku alage indulone sirimalle song kuda post cheyandi sir please
థాంక్స్ అజ్ఞాత గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.