అమృత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ వినవచ్చు.
చిత్రం : అమృత (2002)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే
నీ చిన్నారి ముద్దు పెడితే
చెక్కిళ్ళ ముద్దు పెడితే
నీ చిన్నారి ముద్దు పెడితే
ఏ దేవి వరము నీవో
చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో
చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే
ఆఆఅ..ఆఆ..ఆ
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయినావే
మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవో
చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే
నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే
నీ చిన్నారి ముద్దు పెడితే
ఎదకు సొంతము లే
ఎదురు మాటవు లే
కలికి వెన్నెలవే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని
స్వాతి వానని చిన్న పిడుగని
ప్రాణమైనది పిదప కానిది
ప్రాణమైనది పిదప కానిది
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో
చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే
నీ చిన్నారి ముద్దు పెడితే
సిరుల దీపం నీవే
కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే
తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీరనీ
ఇంటి వెలుగని కంటి నీరనీ
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
నేనెత్తి పెంచిన శోకంలా
ఏ దేవి వరము నీవో
చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో
చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే..ఏఏ..
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయినావే
మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవో
చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్
కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే
నీ చిన్నారి ముద్దు పెడితే
2 comments:
manchi song venugaru female version chinmayiki ee song first song ee songtho manchi peru vachindi and ee song BGM vintunte naku eppudu train velutunte vache sound gurthu vasthuntundi manchi song post chesinanduku thanks
చిన్మయి గారికిది ఫస్ట్ సాంగ్ అని తెలియదండీ... ఫిమేల్ వర్షన్ కూడా బాగుంటుంది.. థాంక్స్ అజ్ఞాత గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.