శనివారం, మే 16, 2015

నువ్వంటే నాకిష్టమని...

సంతోషం సినిమా కోసం సిరివెన్నెల గారు రాసిన ఒక చక్కని పాట ఈ రోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సంతోషం (2002)
సంగీతం : ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల   
గానం : రాజేష్, ఉష

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ 

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా 

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.