శుక్రవారం, మే 15, 2015

గుంజుకున్నా నిన్ను...

కడలి చిత్రం కొసం ఏ.ఆర్.రహమాన్ స్వర సారధ్యంలో శక్తిశ్రీ గోపాలన్ అద్భుతంగా గానం చేసిన వనమాలి రచన ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కడలి
సాహిత్యం : వనమాలి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : శక్తిశ్రీగోపాలన్

గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్లకి ఈడేరునో ఈబతుకే
తేనె చూపే చల్లావు నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా

కొత్త మణిహరం కుడిసేతి గడియారం
పెద్ద పులినైన అణిచే అధికారం
నీవెళ్లినాక నీ నీడే పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే
ఇంక అది మొదలు నామనసే తలవంచే ఎరగదుగా
గొడుగంచై నేడు మదే నిక్కుతోందిగా 

గుంజుకున్నా నిన్ను ఎదలోకే

గువ్వే ముసుగేసిందే రావాకే కునికిందే
పాలేమో పెరుగులాగ ఇందాకే పడుకుందే
రాసకురుపున్నోళ్లే నిదరోయే వేళల్లోన
ఆశ కురుపొచ్చి ఎదే అరనిమిషం నిదరోదే

గుంజుకున్నా నిన్ను ఎదలోకే

ఎంగిలి పడనే లేదే అంగిలి తడవనే లేదే
ఆరేడునాళ్లై ఆకలి ఊసేలేదే
పేద ఎదనే దాటి ఏదీ పలకదు పెదవే
రబ్బరు గాజులకేమో సడి చేసే నోరేదే హ..

హో..గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
 ఇంక ఎన్నాళ్లకి ఈడేరునో ఈబతుకే


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.