సోమవారం, మే 11, 2015

కనులు కనులను...

దొంగ దొంగ చిత్రం కోసం రహమాన్ స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : దొంగ దొంగ (1993)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : మనో

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం....

వాగులై ఉరికితే...వయసు కులుకే అని అర్థం..
కడలియే పొంగితే...నిండు పున్నమేనని అర్థం...
ఈడు పకపక నవ్విందంటే...ఊహు.. అని దానర్థం
అందగత్తెకు అమ్మై పుడితే..ఊరికత్తని అర్థం.. అర్థం..

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం...
కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం...

పడవలే నదులకు...బంధుకోటి అని అర్థం..
చినుకులే వానకు...బోసినవ్వులే అని అర్థం..
వెల్ల వేస్తే చీకటికి అది...వేకువౌనని అర్థం..
ఎదిరికే నువ్వు ఎముకలిరిస్తే...విజయమని దానర్థం అర్థం...

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం...

కనులు కనులను దోచాయంటే..ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే...మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే...ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే...పండగేనని అర్థం అర్థం...

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.