గురువారం, మే 21, 2015

ఒక బృందావనం...

ఘర్షణ చిత్రం కోసం ఇళయరాజా స్వరకల్పనలో వాణీజయరాం గానం చేసిన ఒక మధుర గీతం ఈరోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు.


చిత్రం : ఘర్షణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : వాణీ జయరాం

ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
 

నే సందెవేళ జాబిలి..
నా గీతమాల ఆమని
నా పలుకు తేనె కవితలే..
నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలల మేడ నందనం
నాలోని వయసు ముగ్ధ మోహనం

ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

 
నే మనసు పడిన వెంటనే
ఓ ఇంధ్రధనుసు పొందునే
ఈ వెండి మేఘమాలనే
నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజి పూవులే
నాకింక సాటి పోటి లేదులే

ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.