మిత్రులందరకూ మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్బంగా అమ్మ తన బాబు కోసం పాడే ఈ పుట్టినరోజు పాటలో తన ప్రేమను ఎలా రంగరించిందో చూద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అమ్మ చెప్పింది (2006)
సంగీతం : M. M. కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : ప్రణవి
అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా
అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా
నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజుని
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday చిన్ని కన్న
Happy Birthday To You
అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా
నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని
కలతలెరుగని లోకంలో కాలమాగిపొతే
వన్నె తగ్గని చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే
ప్రతీ నెల ఒకే కళ నీ పాలనవ్వుతో
తారలే నీకు అక్షతలై తల్లి దీవెనలు హారతులై
నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజుని
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday చిన్ని కన్న
Happy Birthday To You
ఎదురు చూడని కానుకలే దాచి ఉంచేనురా
మలుపు మలుపులో జీవితమే నీకు ఇచ్చేనురా
నువ్వే కదా ఈ అమ్మకి ఒక పెద్ద కానుక
నీకు ఏమివ్వగాలనంట నేను ఆశించడం తప్ప
నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజుని
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday చిన్ని కన్న
Happy Birthday To You
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.