స్వప్న చిత్రం కోసం సత్యం గారి స్వరసారధ్యంలో బాలు పాడిన ఒక మధుర గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : స్వప్న (1980)
సంగీతం : సత్యం
సాహిత్యం : సి.నారాయణరెడ్డి
గానం : బాలు
అంకితం.. నీకే అంకితం
అంకితం.. నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం.. నీకే అంకితం
ఓ ప్రియా... ఆ... ఆ... ఓ ప్రియా... ఓ ప్రియా..
సంగీతం : సత్యం
సాహిత్యం : సి.నారాయణరెడ్డి
గానం : బాలు
అంకితం.. నీకే అంకితం
అంకితం.. నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం.. నీకే అంకితం
ఓ ప్రియా... ఆ... ఆ... ఓ ప్రియా... ఓ ప్రియా..
కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత
త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ధసార నవత
నవ వసంత శోభనా మయూఖ..
లలిత లలిత రాగ చంద్రరేఖ..
స్వరము స్వరము కలయిక లో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయిక లో అనురాగం పుడుతుందీ...
స్వరము స్వరము కలయిక లో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయిక లో అనురాగం పుడుతుంది
ఆ అనురాగం ఒక ఆలయమైతే.. ఏ.. ఏ...
ఆ ఆలయ దేవత నీవైతే..ఏ ఏ...
ఆ ఆలయ దేవత నీవైతే..
గానం గాత్రం గీతం భావం.. సర్వం అంకితం
అంకితం.. నీకే అంకితం
త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ధసార నవత
నవ వసంత శోభనా మయూఖ..
లలిత లలిత రాగ చంద్రరేఖ..
స్వరము స్వరము కలయిక లో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయిక లో అనురాగం పుడుతుందీ...
స్వరము స్వరము కలయిక లో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు కలయిక లో అనురాగం పుడుతుంది
ఆ అనురాగం ఒక ఆలయమైతే.. ఏ.. ఏ...
ఆ ఆలయ దేవత నీవైతే..ఏ ఏ...
ఆ ఆలయ దేవత నీవైతే..
గానం గాత్రం గీతం భావం.. సర్వం అంకితం
అంకితం.. నీకే అంకితం
లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ ద్వీప
భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప
స్వర విలాస హాస చతుర నయన..
సుమ వికాస భాస సుందర వదన..
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుందీ...
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
ఆ ప్రణయం ఒక గోపురమైతే.. ఏ ఏ ..
ఆ గోపుర కలశం నీవైతే.. ఏ ఏ ..
ఆ గోపుర కలశం నీవైతే..
పుష్పం.. పత్రం.. ధూపం.. దీపం.. సర్వం అంకితం
అంకితం.. నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం... నీకే అంకితం
ఓ..ప్రియా.. ఆ.. ఆ.. ఓ.ప్రియా.. ఓ.. ప్రియా..
భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప
స్వర విలాస హాస చతుర నయన..
సుమ వికాస భాస సుందర వదన..
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుందీ...
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
ఆ ప్రణయం ఒక గోపురమైతే.. ఏ ఏ ..
ఆ గోపుర కలశం నీవైతే.. ఏ ఏ ..
ఆ గోపుర కలశం నీవైతే..
పుష్పం.. పత్రం.. ధూపం.. దీపం.. సర్వం అంకితం
అంకితం.. నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం... నీకే అంకితం
ఓ..ప్రియా.. ఆ.. ఆ.. ఓ.ప్రియా.. ఓ.. ప్రియా..
6 comments:
This song is written by Dr C. Narayan reddy but not by Dasari. Plz check.
థాంక్స్ విద్యాసాగర్ గారూ... ఫూల్ ప్రూఫ్ వెరిఫికేషన్ కి నాకు అవకాశం లేదండీ.. కొన్ని వెబ్ సైట్స్ లో రాజశ్రీ అనీ కొన్నిటిలో దాసరి అని కొన్నిటిలో సినారె గారని ఉంది. ప్రస్తుతానికి మీ వ్యాఖ్యను బట్టి సాహిత్యాన్ని బట్టి సినారే గారనే అప్డేట్ చేశాను పోస్ట్ లో.
అంకితం నీకే అంకితం
సినారె మార్కూ సుస్పష్టం సోదరా
Thanks for re assuring సోదరా...
సినారె గారు అద్భుతమైన సాహిత్యం వ్రాశారు ఈ పాటలో. సత్యం గారి చక్కటి బాణీలో బాలు గారు అనితర సాధ్యం గా పాడారు
అవును అజ్ఞాత గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.