గురువారం, మే 07, 2015

నా ఇంటి ముందున్న...

రహ్మాన్ సంగీత సారధ్యంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జెంటిల్మాన్ (1993)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుజాత

నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..
నువ్వేనా ప్రాణమే..

నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..
నువ్వేనా ప్రాణమే.

నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట..
మనసార చేరే వేళ మౌనాలే తగదంట..
సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట..
వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట..
ఆషాఢం పోయిందో గోదారి పొంగెనూ..
వైశాఖం వచ్చిందో అందాలే పూచేనూ..
ఈడే సద్దు చెసెనూ..

నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో..
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..
నేనే నీ ప్రాణమే..

నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో..
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..
నేనే నీ ప్రాణమే..

గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది..
మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది..
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేను..
చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను..
ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి..
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి..
మ్ హుమ్ మ్..పరవశమే..

నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..
నువ్వేనా ప్రాణమే.

నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో..
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..
నేనే నీ ప్రాణమే..



1 comments:

అమ్మయి మనసులో ప్రేమ పొంగేటప్పుడు..ఇంటి ముండు పూదోట విరబూయకుండా ఉంటుందా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.