శుక్రవారం, మే 01, 2015

గుర్తుకొస్తున్నాయి...

నా ఆటోగ్రాఫ్ సినిమాకోసం కీరవాణి గారి స్వరరచనలో కేకే గానం చేసిన ఒక అందమైన చంద్రబోస్ రచనను ఈరోజు గుర్తుచేసుకుందాం. పాట పూర్తి వీడియో దొరకలేదు ఒక చరణం ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కె.కె.

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
యెదలోతులో.. యేమూలనో..
నిదురించు ఙ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో
మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తి
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలొ బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సుబ్బు గాడిపై చెప్పిన చాడి
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయబు పూసిన సెంటూ
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయందనము

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
యెదలోతులో.. యేమూలనో..
నిదురించు ఙ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
 

1 comments:

ఈ మూవీ వచ్చాక చాలామంది తము చిన్నఫ్ఫుడు చదువుకున్న, ఆడుకున్న ,పెరిగిన ప్లేసెస్ చూశారట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.