గురువారం, ఏప్రిల్ 30, 2015

అమ్మమ్మో అమ్మో...

అలామొదలైంది చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అలామొదలైంది (2011)
సంగీతం : కళ్యాణి మాలిక్
సాహిత్యం : అనంతశ్రీరామ్
గానం : కళ్యాణిమాలిక్, నిత్య మీనన్

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే అల  
కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముల్లై తాకదా
ఊహల్లో ఎన్నోఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా 
 
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల

ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు అవి కావా మా ఆస్తులు
ప్రేమించక ముందరే ఈ తీయని కవితలు తరువాత అవి కసురులు
 
అన్నీ వింటూ ఆనందిస్తూ ఆ పైన I'm sorry అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ simple గా NO అందురు

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల

కన్నీటిబాణమే వేసేటి విద్యలో ముందుంది మీరే కదా
మౌనాన్నే కంచెగా మలచేటి కోర్సులో distinction మీదే కదా
కన్నీరైనా మౌనం ఐనా చెప్పేది నిజమేలే ప్రతిరోజు
అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించవు

 
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముల్లై తాకదా 
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా  


1 comments:

అల్లరి అమ్మాయిలని భరించ్డం అబ్బాయిలకో అందమైన కల..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.