శనివారం, ఏప్రిల్ 18, 2015

ప్రేమా పిచ్చీ ఒకటే...

అనురాగం చిత్రం కోసం భానుమతి గారు గానం చేసిన ఒక మధురగీతం ఈ రోజు వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అనురాగం (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆత్రేయ
గానం : భానుమతి 

ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను వేరే
ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను ప్చ్ వేరే

 
కధచెపుతాను ఊ కొడతావా
ఊ కొడతావా
జో కొడతాను బబ్బుంటావా 
బబ్బో
కధచెపుతాను ఊ కొడతావా
జో కొడతాను బబ్బుంటావా
అది ఇది కాదని 
అమ్మను కానని అల్లరి చేస్తావా
నన్నల్లరి చేస్తావ 


ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను ప్చ్.. ఆఆ..
 

నిండు మనసనే వెండి గిన్నెలో 
నెయ్యీ నెయ్యం కలిపాను
నిండు మనసనే వెండి గిన్నెలో 
నెయ్యీ నెయ్యం కలిపాను
పసిడి గిన్నెలో పాలబువ్వలో 
ఆశా పాశం నిలిపాను.. 
ఆఆఆ..ఆఆఆఅ....
ఆఆఆ..ఆఆఆఅ....

ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను వేరే..
 

తల్లి కాని ఈ తల్లి గుండెలో 
ఎవరూ ఊగని ఊయలలో 
అమ్మకాని ఈ అమ్మ గొంతులో 
ఎవరికి పాడని పాటలలో 
జో..జో..జో.. 
జో..జో..జో..

ప్రేమా.. పిచ్చీ.. ఒకటే
నువ్వు నేను ప్చ్.. ఆఆ..
 

1 comments:

ఈ స్టేట్ మెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ..భానుమతి గారు..మై మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.