జి.కె.వెంకటేష్ గారి స్వరసారధ్యంలో సుశీల గారు పాడిన ఒక మధుర గీతాన్ని ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జమిందారు గారి అమ్మాయి (1975)
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం : దాశరథి
గానం : పి.సుశీల
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
అధరాల మీద ఆడిందినామం
అధరాల మీద ఆడిందినామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
సిరిమల్లెపువ్వూ కురిసింది నవ్వూ
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
1 comments:
మనసుని వీణలా మీటే పాట..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.