బుధవారం, ఏప్రిల్ 15, 2015

అందమా అందుమా...

గోవిందా గోవిందా సినిమా కోసం రాజ్-కోటి స్వరకల్పనలో సిరివెన్నెల గారి రచన ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గోవిందా గోవిందా (1993)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదే ..
ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే

వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి ..
చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి..
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత...

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
 
వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
 
తియ్య తియ్యగా నచ్చ చెప్పని ..
చిచ్చి కోట్టనీ ఇలా.. వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ..
వగల మారి వయసు పోరు నా వల్లన
 
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా..
ఆదుకో నాయనా... ఆర్చవా... తీర్చవా.. చింత
 
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
 

1 comments:

పాపం రామూజీ యెన్ని వేల సార్లు ఈ పాట పాడుకుని ఉంటారో కదండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.