శనివారం, ఏప్రిల్ 04, 2015

శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ...

ఈ రోజు హనుమజ్జయంతి సంధర్బంగా సూపర్ మాన్ సినిమాకోసం చక్రవర్తి గారు స్వరపరచిన ఈ పాట విని ఆ హనుమంతుని తలచుకుంటూ ఆయన కృపకు పాత్రులమవాలని కోరుకుందాం మనమందరం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సూపర్ మాన్ (1980) 
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల

ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహమ్  
యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్త కాంజలిమ్
బాష్పవారి పరి పూర్ణ లోచనం
భావయామి పవమాన నన్దనమ్

శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ
శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ 
శ్రీరామ పద పద్మ సేవా ప్రమేయా.. 
మాంపాహి పాహి.. మాం పాహి పాహి..

తతో రావణ నీతాయాః సీతాయా శత్రు కర్శన:|
ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి:||
సుందరమైనది సుందరకాండ 
సుందరకాండకు నీవే అండ 
సుందరమైనది సుందరకాండ 
సుందరకాండకు నీవే అండ
వారధి దాటి సీతను చూచి 
అంగుళి నొసగి లంకను కాల్చిన 
నీ కథ వింటే మాకు కొండంత బలమంట.. 

శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ 
శ్రీరామ పద పద్మ సేవా ప్రమేయా.. 
మాంపాహి పాహి.. మాం పాహి పాహి..

తతస్థం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః |
భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంత మభాషత ||
శ్రీ రఘురాముని ఓదార్చినావూ 
వానర సైన్యాన్ని సమకూర్చినావు
శ్రీ రఘురాముని ఓదార్చినావూ 
వానర సైన్యాన్ని సమకూర్చినావు
నీసాయముంటే నిరపాయమేనని 
నమ్మిన నన్ను ఏ దరి చేర్చేవు.. 
నా నమ్మిక వమ్మైతే నాగతి ఏమౌను..

శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ 
శ్రీరామ పద పద్మ సేవా ప్రమేయా.. 
మాంపాహి పాహి.. మాం పాహి పాహి..

దుష్ట శిక్షకా శిష్ట రక్షక ధర్మ పాలకా ధైర్య దీపికా 
జ్ఞాన దాయక విజయ కారక నిన్ను కానక నేను లేనిక 
జయకర శుభకర వానర ధీవర ఇనకుల భూవర కింకర 
త్రిభుజన నిత్య భయంకర 
రావేరా దరిశనమీవేరా 
రావేరా దరిశనమీవేరా 


1 comments:

గుడ్ సాంగ్..ఇది చాలా గొప్ప ఎంటెర్టైనింగ్ మూవీ అండీ..అసలు యన్.టీ.ఆర్ హనుమాన్ మేన్ గా అంటే బనీన్ పై "హెచ్" ఉంటుంది మరి..గాలిలో ఈదుతూ వెళ్లే దృశ్యాలు చూసి తీరాలండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.