ఆదివారం, ఏప్రిల్ 05, 2015

ప్రియురాలి అడ్రస్ ఏమిటో...

వందేమాతరం శ్రీనివాస్ కు గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆహా (1998)
సంగీతం : వందేమాతరం  శ్రీనివాస్
రచన :
గానం : వందేమాతరం  శ్రీనివాస్

ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ఆమె సిగను విరిసే మల్లీ ఆమె నుంచి వీచే గాలీ
ఆమె నిదుర పోయే వేళా జోల పాడు ఓ జాబిల్లీ
ఆమె సిగను విరిసే మల్లీ ఆమె నుంచి వీచే గాలీ
ఆమె నిదుర పోయే వేళా జోల పాడు ఓ జాబిల్లీ
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
 
ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
 

నిదుర నదిలో ఆమె కోసం నడిరేయి చాటునా మాటు వేసా
కలల వలలో ఆమె రూపం పడగానె వెంటనే లేచి చూశా
ఎదను కొరికే చిలిపి చేపా కులుకు వెనకే కరిగిపోగా
తెల్లారిందే ఇట్టే నేనేమో తెలబోతూ ఉంటే
మళ్ళీ మళ్ళీ ఇంతే ప్రతి రాత్రీ జరిగే తంతే
మసక తెరలు తెరిచేదెవరమ్మా
 
ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
 
కనులు వెతికే కన్నె ఎవరో వివరాలు తేలనీ మనసు నాదీ
తనను ఎవరో పలకరిస్తే నువు కాదు పొమ్మనీ అంటున్నదీ
జంటలెన్నో కంటబడితే వయసు నన్నూ కసురుతోందే
భూమ్మీదింకా తానూ పుట్టిందో లేదో భామా
ఏమో తెలియదు గానీ మది ప్రేమించేసిందమ్మా
దీని గొడవ ఆపేదెవరమ్మా

ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

1 comments:

యెలాగైనా వందేమాతరం గారి గొంతులో యెఱ్ఱ పాటలూ, కొండకచో సెంటిమెంట్ పాటలే బెటరనుకుంట..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.