బుధవారం, ఏప్రిల్ 29, 2015

ఎన్నెల్లో ముత్యమా...

ఈ రోజు ఇంటర్నేషనల్ డాన్స్ డే.. ఈ సంధర్బంగా మయూరి చిత్రంలోని ఈ అందమైన నృత్య రూపకాన్ని చూసి ఆనందిద్దామా. ఈ పాట వీడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.

 
చిత్రం : మయూరి (1985)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి, కోరస్

ఎన్నెల్లో ముత్యమా ఎండల్లో పద్మమా
చీకట్లో దీపమా సిరికే ప్రతిరూపమా
ఏ పేరో ఏ ఊరో చెప్పవమ్మా
తెలుగింటి కలికంటి తేనెలమ్మా
చెప్పవమ్మా తేనెలమ్మా 
చెప్పవమ్మా తేనెలమ్మా..

మహాకవి గురజాడ మానస పుత్రికవు నీవు 
పుత్తడి బొమ్మవా.. పూర్ణమ్మవా..ఆఆఆఆ.ఆఆ..

నా కన్నులు కలువల రేకులనీ
నా అడుగులు హంసల రాకలనీ
నా పలుకులు తేనెల వాకలనీ
తెలిసీ తెలిసీ ఎంత వగచినా
తాతతోనె ముడి పెట్టారు
తాళితోనె ఉరి తీసారు
అమ్మల్లారా అక్కల్లారా.. ఆకాశంలో చుక్కల్లారా
నెలకోసారి వస్తూ ఉన్నా నిండుగ పున్నమినై
మీలోనే జీవిస్తున్నా పుత్తడిబొమ్మ పూర్ణమనై..
పుత్తడిబొమ్మ పూర్ణమనై..

విశ్వనాథుని చేత తొలినాటి కవితవై
విరితేనియలు పొంగు సెలయేటి వనితవై
వెలుగొందు తెలుగు జిలుగుల రాణివి
అవును..! కిన్నెరసానివి!

తొలుత నా కన్నీరు కాల్వలై పారింది
పిదప అది వాగులై వంకలై పొంగింది
తరగలై నురగలై తరగలే పడగలై 
పడగలే అడుగులై అడుగులే మడుగులై 
పరుగులెత్తినదానిని..నేను పరువాల దొరసానిని..
కొడుకు దశనే దాటి మగడు కాలేని
ఒక పడుచువానికి తగని గడుసు ఇల్లాలిని
నేను కిన్నెరసానిని.. పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని..
నేను కిన్నెరసానిని.. పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని..

ఎవ్వరెరుగనిదమ్మ నండూరి యెంకీ..
పువ్వులా నవ్వేటి తెలుగు పూబంతి

కడవాకైనా లేదు తొడిమంత ఎడము
ఎడమెట్టాగుంటాది పిడికెడే నడుము
కడవాకైనా లేదు తొడిమంత ఎడము
ఎడమెట్టాగుంటాది పిడికెడే నడుము
మబ్బు తెరనే విడిచె వంకా జాబిల్లి
ఉబ్బరాలా రైకలో తెప్పరిల్లి
అబ్బరాలో ఏమి నిబ్బరాలో
జారుపైటే చాలు జావళీ పాట
లాలాలాఅ లలలల లలలలా

నాయుడోరి జాణ నడిచేటి వీణ
వెన్ను తడితే చాలు వెన్నెల్లు కరుగు 
గోవు పొదుగుల్లోన గోదారి పొంగు
ఎన్నెల్లో మునకిడిచి ఏడు మల్లెల కొదిగి
తెలుగింట పుట్టింది యెలుగంటి యెంకి
తెలుగల్లె ఎదిగింది చిలకంటి యెంకి
యెలుగంటి యెంకీ చిలకంటి యెంకీ

యెలుగంటి యెంకీ ఆఆఆ చిలకంటి యెంకీ
యెలుగంటి యెంకీ చిలకంటి యెంకీ


1 comments:

రియల్ లఫ్ లో యెందరికో ఆదర్శం సుధాచంద్రన్..హేట్సాఫ్ టూ హెర్ యాంబిషన్ టువార్డ్స్ డాన్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.