ప్రకృతిలోని ప్రతి అణువూ తమ ప్రేమ గురించే మాటాడుకుంటుందనుకుంటూ పాడుకుంటున్న ఈ ప్రేమజంటను చూసొద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : నిత్యకళ్యాణం పచ్చతోరణం (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.బి.శ్రీనివాస్, సుశీల
నీమది పాడెను ఏమని
నిజానికి నీవే నేనని
నీమది పాడెను ఏమని
నిజానికి నీవే నేనని
తీయని మనసుల వీణలు మీటి
తుమ్మెద ఏమనె పూవులతోటీ
తీయని మనసుల వీణలు మీటి
తుమ్మెద ఏమనె పూవులతోటీ
చెలిమికి సాటియె లేదనెను
విభేదము వలపున రాదనెను
నీమది పాడెను ఏమని
నిజానికి నీవే నేనని
నీమది పాడెను ఏమని
నిజానికి నీవే నేనని
చల్లగ సాగుతు జీవిత నౌక
మెల్లగ ఏమనె ప్రేమిక
చల్లగ సాగుతు జీవిత నౌక
మెల్లగ ఏమనె ప్రేమిక
ఇరువురినొకటే కోరమనె
ఆ కోరిన తీరమూ చేరమనె
నీమది పాడెను ఏమని
నిజానికి నీవే నేనని
నీమది పాడెను ఏమని
నిజానికి నీవే నేనని
గూటికి చేరుచు గువ్వల జంట
గుస గుస లాడెను ఏమని మింట
గూటికి చేరుచు గువ్వల జంట
గుస గుస లాడెను ఏమని మింట
తమవలె మనమూ ఏకమనే
మన ప్రేమయె మనకూ లోకమనే
నీమది పాడెను ఏమని
నిజానికి నీవే నేనని
ఆఆఆఆ..ఆఆఆ..ఆఆఅ...
1 comments:
మనసు ఆనందం గా ఉంటే నిజంగానే ప్రతీదీ అందం గా కనిపిస్తుంది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.