సోమవారం, ఏప్రిల్ 20, 2015

కలహంస నడకదానా...

జె.విరాఘవులు గారి స్వర రచనలో బాలు గారు పాడిన మరో అద్భుతమైన పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సమాధికడుతున్నాం చందాలివ్వండి  (1980)
సంగీతం : జె.వి.రాఘవులు 
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు 

కలహంస నడకదానా.. 
కమలాల కనులదానా
నీ కనులు.. నీలి కురులు.. 
నను నిలువనీకున్నవే
కలహంస నడకదానా..ఆఆ..

చెలి మేని కదలికలా.. 
అవి భరత నాట్యాలు
జవరాలి భంగిమలా.. 
అరుదైన శిల్పాలు
చెలి మేని కదలికలా.. 
అవి భరత నాట్యాలు
జవరాలి భంగిమలా.. 
అరుదైన శిల్పాలు
కలలు తలపోసి.. 
కళలు కలబోసి..
ఎవరు మలిచేరు ఈ రూపం!

కలహంస నడకదానా.. 
కమలాల కనులదానా
నీ కనులు.. నీలి కురులు.. 
నను నిలువనీకున్నవే
కలహంస నడకదానా.ఆఆఆ.

శ్రీదేవి కోవెలలో 
ఈ దేవి నా జతలో 
కొలువైన వేళలో 
ఎన్నెన్ని భావనలో 
శ్రీదేవి కోవెలలో 
ఈ దేవి నా జతలో 
కొలువైన వేళలో 
ఎన్నెన్ని భావనలో 
చేయి జతకలిపి 
గొంతు శృతికలిపి 
ఏకమవుదాము ఈ నాడే 

కలహంస నడకదానా.. 
కమలాల కనులదానా
నీ కనులు.. నీలి కురులు.. 
నను నిలువనీకున్నవే
కలహంస నడకదానా.ఆఆఆ.


1 comments:

నిజంగానే అన్ని వొంపులు తిరుగుతుంది మన బాలూగారి వాయస్ ఈ పాటలో కదండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.