జీవన జ్యోతి చిత్రం కోసం మహదేవన్ గారి స్వరసారధ్యంలో వచ్చిన ఈ సరదా అయిన పాట బాగుంటుంది. సాధారణంగా పాటంతా పల్లవి ఒక ట్యూన్ లోనూ చరణాలు ఒక ట్యూన్ లోనూ సాగితే మూడో చరణం పాటకన్నా మరికొంచెం హుషారైన ట్యూన్ లో సాగి ఆకట్టుకుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జీవన జ్యోతి (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల
సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని
సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని
ఓ వన్నెగాజుల సిన్ని
తుర్రుమని నువ్ వెళ్ళిపోతే..
తూరుపు దిక్కు ఆపేస్తుంది
ఉరుమురిమి చూసావంటే..
ఉత్తర దిక్కు ఊపేస్తుంది
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల
సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని
సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని
ఓ వన్నెగాజుల సిన్ని
తుర్రుమని నువ్ వెళ్ళిపోతే..
తూరుపు దిక్కు ఆపేస్తుంది
ఉరుమురిమి చూసావంటే..
ఉత్తర దిక్కు ఊపేస్తుంది
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
సిన్నివో సిన్నీ ఓ సన్నజాజుల సిన్ని..
ఓ వన్నెగాజుల సిన్నీ
కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే.. నన్నల్లరి పెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను.. నిన్ను కమ్మేస్తాను
ఓ వన్నెగాజుల సిన్నీ
కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే.. నన్నల్లరి పెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను.. నిన్ను కమ్మేస్తాను
కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే.. నన్నల్లరి పెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను.. నిన్ను కమ్మేస్తాను
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను.. నిన్ను కమ్మేస్తాను
గోదారి పొంగల్లె నామీదికి వురికొస్తే...
గొదారి పొంగల్లె నామీదికి వురికొస్తే..
రాదారి పడవల్లె తేలి తేలి పోతాను ..
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
సిన్నివో సిన్నీ..ఓ సన్నజాజుల సిన్నీ...
ఓ వన్నెగాజుల సిన్నీ
కొమ్మ మీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం
కొమ్మ మీది చిలకమ్మకు కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి అలకే అందం
గుటిలోని గోరింకకు చాటు సరసం అందం
గుటిలోని గోరింకకు చాటు సరసం అందం
ఈ గుంటూరి పిలగానికి నాటు సరసం..
అందం..జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
సిన్నివో సిన్నీ..ఓ సన్నజాజుల సిన్నీ..
ఓ వన్నెగాజుల సిన్నీ
పూతరేకుల తీయదనం...
నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం...
నీ పడుచుదనంలో వుందీ
పూతరేకుల తీయదనం...
నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం..
నీ పడుచుదనంలో వుందీ
కోడెగిత్త పొగరంతా...
నీ కొంటే వయసులో వుందీ
కోడెగిత్త పొగరంతా...
నీ కొంటే వయసులో వుందీ
అందుకేనేమో....ఉ... అందుకేనేమో...
తుర్రుమని నే నెళ్ళాలంటే..
తూరుపుదిక్కు ఆపేసింది
ఉరుమురిమి చూడాలంటే..
ఉత్తరదిక్కు ఊపేసింది..
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
ఓ వన్నెగాజుల సిన్నీ
పూతరేకుల తీయదనం...
నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం...
నీ పడుచుదనంలో వుందీ
పూతరేకుల తీయదనం...
నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం..
నీ పడుచుదనంలో వుందీ
కోడెగిత్త పొగరంతా...
నీ కొంటే వయసులో వుందీ
కోడెగిత్త పొగరంతా...
నీ కొంటే వయసులో వుందీ
అందుకేనేమో....ఉ... అందుకేనేమో...
తుర్రుమని నే నెళ్ళాలంటే..
తూరుపుదిక్కు ఆపేసింది
ఉరుమురిమి చూడాలంటే..
ఉత్తరదిక్కు ఊపేసింది..
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
సిన్నివో సిన్నీ.. సిన్ని ఈ సిన్ని..
నీ సన్నజాజుల సిన్ని..
నీ వన్నె గాజుల సిన్ని...
పున్నమి చంద్రునిలోనే ఈ సిన్ని..
వెన్నెలై విరబూస్తుందీ ఈ సిన్ని
నీ సన్నజాజుల సిన్ని..
నీ వన్నె గాజుల సిన్ని...
పున్నమి చంద్రునిలోనే ఈ సిన్ని..
వెన్నెలై విరబూస్తుందీ ఈ సిన్ని
సిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్నీ..
ఓ వన్నెగాజుల సిన్నీ..ఆ..అహ హాహహ అహా
ఓ...ఒహోహో...హోహో ఓహో..
ఓ వన్నెగాజుల సిన్నీ..ఆ..అహ హాహహ అహా
ఓ...ఒహోహో...హోహో ఓహో..
1 comments:
జాజిమల్లెలు గుచ్చుకున్నట్టుటుందీ పాట..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.