మంగళవారం, నవంబర్ 21, 2017

పట్టుదలతో చేస్తే సమరం...

సంబరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంబరం (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మల్లికార్జున్

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తోడై ఉండగా
ఏ సాయం కోసం చూడకా
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏ నాడూ వెనకడుగేయకా
ఏ అడుగూ తడబడనీయకా
నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే
కష్టం అంటే దూది కూడా భారమే
లక్ష్యమంటూ లేని జన్మే దండగా
లక్షలాది మంది లేరా మందగా
పంతం పట్టీ పోరాడందే
కోరిన వరాలు పొందలేవు కదా

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే
చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా
ఎక్కలేని కొండనేదీ లేదురా
నవ్వే వాళ్ళు నివ్వెరపోగా
దిక్కులు జయించి సాగిపోర మరి

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తోడై ఉండగా
ఏ సాయం కోసం చూడకా
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏ నాడూ వెనకడుగేయకా
ఏ అడుగూ తడబడనీయకా
నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా

పట్టుదలతో చేస్తే సమరం
తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.