చంద్రలేఖ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : చంద్రలేఖ (1998)
సంగీతం : సందీప్ చౌతా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : రాజేష్ క్రిష్ణన్
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
పర పరపప్పరర పాప్పరర పాప్పరరర
ఒక్కటంటె ఒక్క లైఫే.. ఏడిపించకు దాన్ని
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
పెదవులపై విరబూసే నవ్వు పువ్వులు వాడవురా
సరదాగా నవ్వేస్తె దిగులు నిన్నిక చూడదురా
రాత్రిలో సొగసు ఎమిటో చూపడానికె చుక్కలు
బ్రతుకులో తీపి ఎమిటో చెప్పడానికె చిక్కులు
పర పరపప్పరర పాప్పరర పాప్పరరర
ఒక్కటంటె ఒక్క లైఫే.. ఏడిపించకు దాన్ని
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
నవ్వంటూ తోడుంటే చందమామవి నువ్వే
నీ చుట్టూ చీకటికి వెండి వెన్నల నీ నవ్వే
మువ్వలా శాంతి గువ్వలా నవ్వు రవ్వలే చిందని
గల గల నవ్వగలగడం మనిషికొకడికే తెలుసని
పర పరపప్పరర పాప్పరర పాప్పరరర
ఒక్కటంటె ఒక్క లైఫే.. నవ్వుకోనీ దాన్ని
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
పర పరపప్పరర పాప్పరర పాప్పరరర
ఒక్కటంటె ఒక్క లైఫే.. నవ్వుకోనీ దాన్ని
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో
అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.