శనివారం, నవంబర్ 18, 2017

పరుగులు తీయ్...

మర్యాదరామన్న చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మర్యాదరామన్న (2010)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర

పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర
పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర

దడదడ దడదడలాడే ఎద సడి ఢమరుకమై
వడి వడి వడి వడి దూకే పదగతి తాండవమై
పంచ ప్రాణముల పంచాక్షరితో
శివుని పిలుచు సంకల్పమై
దూసుకు వచ్చే మృత్యువుకందని
మార్కండేయుడవై

పరుగులు తీయ్.. ఉరకలు వేయ్..
పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర 
బిర బిర బిర బిర చర చర చర చర 

కుత్తుక కోసే కత్తి కొనలు... కత్తి కొనలు
కుత్తుక కోసే కత్తి కొనలు
దరి దాపుకు చేరని దూకుడువై
ఆయువు తీసే ఆపద కూడా
అలసటతో ఆగేలా చెయ్
మట్టిలోకి తన గిట్టలతో నిను తొక్కెయ్యాలని
తరుముకువచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్

పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర 
పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర 
 
ఎడారి దారుల తడారి పోయిన
ఆశకు చెమటల ధారలు పోయ్
నిస్సత్తువతో నిలబడనివ్వక
ఒక్కో అడుగును ముందుకు వెయ్
వంద ఏళ్ల నీనిండు జీవితం
గండి పడదనే నమ్మకమై
శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు
బ్రతికి ఉండగల సాహసానివై

పరుగులు తీయ్.. ఉరకలు వేయ్..
పరుగులు పరుగులు పరుగులు తీయ్
ఉరకలు ఉరకలు ఉరకలు వేయ్ 
బిర బిర బిర బిర చర చర చర చర
బిర బిర బిర బిర చర చర చర చర 
 
హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.