పిల్ల జమిందార్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పిల్ల జమీందార్ (2011)
సంగీతం : సెల్వ గణేష్
సాహిత్యం : కృష్ణ చైతన్య
గానం : శంకర్ మహదేవన్, బృందం
తలబడి కలబడి నిలబడు
పోరాడే యోధుడు జడవడు
తలబడి కలబడి నిలబడు
పోరాడే యోధుడు జడవడు
సంకల్పం నీకుంటే
ఓటమికైనా వణుకేరా
బుడిబుడి అడుగులు తడబడి
అడుగడుగున నీవే నిలబడి
ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి
వెలుగంటూ రాదు అంటే సూరీడైన లోకువరా
నిశిరాతిరి కమ్ముకుంటే
వెన్నెల చిన్నబోయెనురా
నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది
ప్రకాశంలో సూరీడల్లే
ప్రశాతంగా చంద్రుడిమల్లే
వికాసంలో విద్యార్థల్లే
అలా అలా ఎదగాలి
ప్రకాశంలో సూరీడల్లే
ప్రశాతంగా చంద్రుడిమల్లే
వికాసంలో విద్యార్థల్లే
అలా అలా ఎదగాలి
పిడికిలినే బిగించి చూడు
అవకాశం నీకున్న తోడు
అసాధ్యమే తలొంచుకుంటూ
క్షమించు అనేదా
రేపుందని లోకాన్ని నమ్మి
అలసటతో ఆగదు భూమి
గిరాగిరా తిరిగేస్తుంది
క్రమంగా మహా స్థిరంగా
ప్రతి కలా నిజమౌతుంది ప్రయత్నమే ఉంటే
ప్రతీకవే నువ్వౌతావు ప్రవర్తనే ఉంటే
ప్రకాశంలో సూరీడల్లే
ప్రశాతంగా చంద్రుడిమల్లే
వికాసంలో విద్యార్థల్లే
అలా అలా ఎదగాలి
ప్రకాశంలో సూరీడల్లే
ప్రశాతంగా చంద్రుడిమల్లే
వికాసంలో విద్యార్థల్లే
అలా అలా ఎదగాలి
జీవితమే ఓ చిన్న మజిలీ
వెళిపోమా లోకాన్ని వదిలి
మళ్లీ మళ్లీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని
గమ్యం నీ ఊహల జననం
శోధనలో సాగేది గమనం
ప్రయాణమే ప్రాణం కాదా
గెలుపుకి. ప్రతి మలుపుకి
ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే
ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే
ప్రకాశంలో సూరీడల్లే
ప్రశాతంగా చంద్రుడిమల్లే
వికాసంలో విద్యార్థల్లే
అలా అలా ఎదగాలి
ప్రకాశంలో సూరీడల్లే
ప్రశాతంగా చంద్రుడిమల్లే
వికాసంలో విద్యార్థల్లే
అలా అలా ఎదగాలి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.