బుధవారం, నవంబర్ 01, 2017

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా...

బ్లాగ్ మిత్రులు, కంప్యూటర్ ఎరా సారధులు శ్రీధర్ నల్లమోతు గారు చేపట్టిన వన్ ఇయర్ ఛాలెంజ్ కు మద్దతుగా ఈ రోజునుండీ ధనుర్మాసం మొదలయ్యే వరకూ స్ఫూర్తిదాయకమైన గీతాలను తలచుకుందాం. పట్టుదల సినిమా కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఓ చక్కని పాటతో ఈ సిరీస్ మొదలు పెడదాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈపాట గురించి సిరివెన్నెల గారి వివరణతో కూడిన వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని వీడియో క్వాలిటీ బాలేనందున ఆడియో ఎంబెడ్ చేస్తున్నాను అది ఇక్కడ చూడవచ్చు. వీడియో చూడాలనుకున్నవారు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పట్టుదల (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.జే. ఏసుదాస్

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

 
నొప్పి లేని నిమిషమేది జననమైన
మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణా
దేహముంది ప్రాణముంది 
నెత్తురుంది సత్తువుంది 
ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా 
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది 
నీకె నువ్వు బాసటైతే

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి


నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న 
గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న 
చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె
హుంకరిస్తే దిక్కులన్ని పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని
కదనుతొక్కి అవధులన్నీ అధిగమించరా
త్రివిక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతం ఆపలేని 
జ్వాల ఓలె ప్రజ్వలించరా 
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.