ఆదివారం, నవంబర్ 26, 2017

హరే రామ హరే రామ...

ఒక్కడు చిత్రంలోని ఒక హుషారైన గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఒక్కడు (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శంకర్ మహదేవన్

గోవింద బోలోహరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో


హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రాముడ్నైనా కృష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో


హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 

  చార్మినార్ చాటు కధకీ తెలియదీ నిత్య కలహం
భాగ్‌మతి ప్రేమ స్మృతికీ బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా
పద పద పద పదమని..
 
హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో


హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 

ఓం సహనాభవతు సహనోభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినామధీతమస్తు మావిద్విషావహై
 
పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
ఆటనే మాటకర్ధం నిను నువే గెలుచు యుద్ధం
శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా
పద పద పద పదమని.. 

హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో


హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.