సోమవారం, జూన్ 29, 2015

ఏదో అడగనా...

ఓకే బంగారం సినిమా కోసం రహ్మాన్ స్వరసారధ్యంలో సిరివెన్నెల గారు రాసిన ఒక చక్కని మెలోడీ ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఓకే బంగారం (2015)
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శాశా తిరుపతి , సత్యప్రకాష్

విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
కొన్నాళ్లుగా ఏదో నీలో ఉన్నదీ...
విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
ఏదో అడగనా ఏదైనా అడగనా
 
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగన

ఏదో.. ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా

చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న స్వరగతులే
చిన్న చిన్న సరదాలు
చిన్న దాని చిన్న చిన్న సంశయాలు
విన్నవించు ఆశలు పలికిన సరిగమలో..ఓ..ఓ..

 
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా 
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగనా...
ఏదో..ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా

తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి సడిలోన
తకధిమి కదలిక
తకధిమి తికమక కవళిక
తదుపరి తకధిమి తెలుపని తరుణంలో

 
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగన
ఏదో..ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.