సోమవారం, జూన్ 01, 2015

ఆ నవ్వులో ఏమున్నదో...

ఎలా చెప్పను చిత్రం కోస సిరివెన్నెల గారు రాసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియోమాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

చిత్రం : ఎలాచెప్పను (2003)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : కార్తీక్

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
ఆ కళ్లతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లే నను తాకింది వరదల్లే నను ముంచింది..
ఔనన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

నచ్చచెప్పినా ఏ ఒక్కరూ నమ్మరే ఎలా నన్నిప్పుడు నేనే నేనన్నా
నచ్చచెప్పినా ఏ ఒక్కరూ నమ్మరే ఎలా నన్నిప్పుడు నేనే నేనన్నా
మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగా
అదుపు తప్పేంత అలజడిగా ఊగిపోలేదుగా
అడుగడుగు అలలవగా పరుగులు నేర్పింది తానే కదా
 
ఔనన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...
 
గుర్తుపట్టనే లేదసలు గుండె లోతులో గుసగుసలు తానొచ్చేదాకా
గుర్తుపట్టనే లేదసలు గుండె లోతులో గుసగుసలు తానొచ్చేదాకా
తెలివి చెప్పింది తుంటరిగా వయసు వచ్చిందనీ
తలుపు తట్టింది సందడిగా నిదర ఎన్నాళ్లనీ
తన చెలిమే అడగమని తరుముకు వచ్చింది తుఫానుగా
ఔనన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
ఆ కళ్లతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లే నను తాకింది వరదల్లే నను ముంచింది..
ఔనన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.