శనివారం, జూన్ 13, 2015

చిలిపి యాత్రలో...

సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య369 చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో అరెరెరె..

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
 
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

ఎదురుగ ఉంది ఏదో వింత 
పదపద చూద్దాం ఎంతో కొంత
కలలకు కూడా కొత్తే అవునా 
కనపడలేదే నిన్నా మొన్నా
కనులవిందుగా ఉందీ లోకం 
కనుక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉందీ రాగం 
కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం 
ఎవర్నైనా హలో అందాం 
ఎటేముందో కనుక్కుందాం
టుమారోల సమాచారమంతా 
సులువుగ తెలిసిన తరుణము కద ఇది 

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో అరెరెరె..

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
 
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
 
వినపడలేదా కూ కూ వెల్కం 
అతిథులమంటూ ఆన్సర్ చేద్దాం 
తళతళలాడే తారా తీరం 
తలుపులు తీసే దారే చూద్దాం
మునుపు ఎప్పుడూ లేదీ మైకం 
మయుడి మిస్టరీ ఏమో ఈ మాలోకం 
మెదడు విక్టరీ చేసే చిత్రం 
తెలివి డిక్ష్నరీ చెప్పే మాయా మంత్రం
నిదానించి ప్రవేశిద్దాం రహస్యాలు పరీక్షిద్దాం 
కనుక్కున్న చమత్కారాలన్ని 
చిలవలుపలవలు కలిపి తెలుపుదాం 

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో అరెరెరె..

చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
 
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.